అమరావతి :
మహిళలకు వారి దేహాలపై హక్కు ఉందని ఏం.టి. పి. చట్టం (గర్భస్రావ చట్టం- Medical Termination of Pregnancy Act) కింద గర్భస్రావం చేయించుకునే హక్కు అవివాహిత మహిళలకు కూడ ఉందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.(X vs The Principal Secretary Health and Family Welfare Department, Delhi NCT Government and Anr., September 29,2022) ఏం.టీ. పి. చట్టం పరిది నుంచి అవివాహితలను మినహయించడం రాజ్యాంగంలోని 14వ అధికరణం స్పూర్తికే బంగకరమని, రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.
ఒకవేళ భర్త బలవంతం కారణంగా ఆమె గర్భం దాలిస్తే అలాంటి గర్భాన్ని ఈ చట్టం కింద తొలగించ వచ్చని కూడ వివరణ ఇచ్చింది. ఫలితంగా, సురక్షితమైన గర్భస్రావ ప్రక్రియకు మహిళలందరూ హక్కుదారులేనని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో, అవివాహితులకు కూడా వారు గర్భం దాల్చిన పక్షంలో, 24 వారాల వరకు గర్భస్రావానికి అర్హత లభిస్తుంది... బి. అశోక్ కుమార్, అడ్వకేట్, ఎ. పి. హైకోర్ట్, విజయవాడ.. సెల్: 9440711998.