Subscribe Us

header ads

రైతులకు సబ్సిడీపై పామ్ ఆయిల్ మొక్కలు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి


ఏలూరు /నూజివీడు:

నూజివీడు నియోజకవర్గంలో ఈ ఏడాది 2,000 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ తోటలు విస్తీర్ణం లక్ష్యంగా చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శనివారం నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో రైతులకు సబ్సిడీపై పామ్ ఆయిల్ మొక్కలను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పంపిణీ చేశారు.తొలుత గ్రామంలో వేంచియున్న.ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తదనంతరం మొక్కల కార్యక్రమం ప్రారంభించిన మంత్రి మొదట గ్రామ రైతు గోళ్ళ నాగరాజు కి ఆయిల్ ఫామ్ మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో ముసునూరు, ఆగిరిపల్లి ,చాట్రాయి ,నూజివీడు మండలాల్లో ప్రస్తుతం 15 వేల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగు అవుతుందని, ఈ ఏడాది మరో 2,000 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ తోటలను విస్తరించాలని లక్ష్యంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పోతిరెడ్డిపల్లి గ్రామంలో ప్రస్తుతం 60 ఎకరాల్లో మాత్రమే ఈ పంట ఉండగా ఈ ఏడాది 200 ఎకరాలకు విస్తరించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు .

ఈ ఏడాది నూజివీడు మండలంలో 600 హెక్టార్లలో మిగిలిన మూడు మండలాల్లో 1400 హెక్టార్లలో పామాయిల్ తోటల విస్తరణ చేయాలని లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు .ఆయిల్ ఫామ్ తోటలు వేసుకునేందుకు హెక్టారుకు నాలుగు సంవత్సరాల పాటు 71 వేల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. మొదటి సంవత్సరంలో మొదటిగా మొక్కల మీద రూ.29,000 ఎరువుల కోసం ప్రతి ఏడాది 5,250 రూపాయలు చొప్పున, అదేవిధంగా పామాయిల్ పంట చేతికి వచ్చేవరకు అంతర్ పంటలు వేసుకునేందుకు నాలుగు సంవత్సరాల పాటు రూ. 5,250 సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. చాప్ కట్టర్స్ కోసం 50 వేల రూపాయలు సబ్సిడీని ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ కోసం రైతులను ప్రోత్సహించేందుకు నూజివీడు, ఆగిరిపల్లి మండలాలకు చెందిన రైతులకు పతాంజలి ఫుడ్స్ ముసునూరు ,చాట్రాయి మండలాలకు చెందిన రైతులు గోద్రెజ్ కంపెనీ మొక్కలను ముందుగా రైతులకు ఉచితంగా అందించాలని మంత్రి కోరారు .రైతులు అధిక దిగుబడి సాధించేందుకు ఉద్యానవన శాఖ సహకారం అందించాలన్నారు. అదేవిధంగా అదనపు ఆదాయం కోసం రైతులు అంతర పంటలను వేసుకోవాలని ఆయన సూచించారు ఆయిల్ ఫామ్ తోటల్లో మైక్రో ఇరిగేషన్ వినియోగించుకోవాలని సూచించారు . 

ఆయిల్ ఫామ్ విస్తీర్ణ పథకంలో రైతులకు మొక్కలను అందించడానికి ఉద్యాన శాఖ మరియు ఆయిల్ ఫామ్ కంపెనీలు (పతంజలి, గోద్రెజ్ ) సిద్ధంగా ఉన్నామని ఉద్యానశాఖ డిడి రామ్మోహన్ తెలిపారు. ఈ పథకము కావాల్సిన రైతులు, రైతు సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రతి మంగళ,బుధవారాల్లో నిర్వహించే పొలం పిలుస్తోంది వాల్ పోస్టర్ ను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ డిడి రామ్మోహన్, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి - పి. రవికుమార్ , జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ కె. హబీబ్ భాష , పతాంజలి లిమిటెడ్ డి జీ యం వీరేంద్ర చౌదరి , నూజివీడు ఉద్యాన శాఖ అధికారిని- ఆర్ హేమ, కే జ్యోతి ప్రియాంక, పార్టీ నాయకులు కాపా శ్రీనివాసరావు , అక్కినేని చందు , అక్కినేని బెనర్జీ , వ్యవసాయ శాఖ అధికారులు,అభ్యుదయ రైతులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.