Subscribe Us

header ads

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల ఆక్రోశం ప్రభుత్వనికి కనిపించడం లేదా?


గుడ్లవల్లేరు :
వేలాది మంది విద్యార్థినులు చదువుతున్న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వాష్ రూమ్లో రహస్య కెమెరాలు అమర్చిన తీవ్ర కలకలం రేపగా అధికార యంత్రాంగం ద్వారా దీన్ని కప్పిపుచ్చేందుకు కాలేజీ నిర్వాహకులు ప్రముఖులకు సన్నిహితులు కావడంతో దీన్ని పక్కదారి పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులను కఠినంగాశిక్షించాలని పి డిఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ప్రభుత్వన్ని స్థానిక సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పి డి ఎస్ యూ ముఖ్యల సమావేశంలో పాల్గోని డీమాండ్ చేశారు.ఈ సందర్బంగా పిడిఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ కాలేజీ విద్యార్థులు వాష్ రూమ్స్ ల్లో రహస్య కెమెరాలు అమర్చి వీడియోలను చిత్రీకరిం చారంటూ వందలాది మంది విద్యార్థినులు గురువారం రాత్రి నుంచి నిద్రాహారాలు లేకుండా తల్లడిల్లు

తుండగా అర్ధరాత్రి హాస్టల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేసి పోలీసులు గుట్టుగా తనిఖీలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.స్నానాల గదిలో షవర్లు ఊడదీసి తరలించడం ఈ ఘటనకు అనుమానాలకు బలం చేకూర్చుతోందిని సీక్రెట్ కెమెరాలపై ఓ విద్యార్థిని వారం క్రితమే ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం. వెనుక ఆంతర్యం ఏంటన్నారు.వాష్ రూమ్ ల్లో సీక్రెట్ కెమెరాల వ్యవహారాన్ని ఓ విద్యార్థిని వారం రోజుల క్రితమే కాలేజీ యాజ మాన్యం దృష్టికి తెచ్చినా నిర్లిప్తంగా వ్యవహారించడం తో పాటు నిన్న సాయంత్రం 5 గంటలకు మరోసారి ఫిర్యాదు చేస్తే విచారణకు నెల సమయం కావాలని మరియు ఫేక్ న్యూస్ అంటూ మళ్లీ రాత్రి ప్రచారం చేయడం దూర్మార్గం

మని వారు యాజమాన్యం పై వారు ఆవేదన వ్యక్తం చేశారు.యజమాన్యం దృష్టికి తెచ్చిన విద్యార్ధినిని తండ్రిని పిలిపించండంటూ రివర్స్ కేసులు పెడతామని బెదిరించడం ఏంటని విద్యార్థులు ఏమైనా తప్పు చేశారా? న్యాయం కోరడమే నేరమా? అని వారు ప్రశ్నించారు.కావున తక్షణమే ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రంగా స్పందించి నిందుతులను కఠినంగా శిక్షించాలని నిర్లక్ష్యం వహించిన కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులతో పాటు కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని లేని పక్షంలో విద్యార్థుల కు న్యాయం చేసే అంత వరకు పిడిఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో పిడిఎస్యూ నాయకులు శ్రీను నరేందర్ యశ్వంత్ వెంకటేష్ లక్ష్మణ్ శ్రీ హరి తదితరులు పాల్గొన్నారు.