ఒకే నెలలో రెండు పెన్షన్లు ఇచ్చిన ఘనత ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకుల సంబరాలు! ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గ, ఏ కొండూరు మండల, రామచంద్రపురం గ్రామంలో ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వానను సైతం లెక్కచేయకుండా
ఆంధ్ర ప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు సెప్టెంబర్ నెలలో ఒకటవ తారీకు ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే ఆగస్టు నెల చివరి రోజున పెన్షన్ అర్హులకు ఏ కొండూరు మండల అధ్యక్షులు గడ్డి కృష్ణారెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన , మరియు బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది