(మంజీరగళం)ప్రతినిధి.కామవరపుకోట
ఏలూరుజిల్లా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్, గూడపాటి కేశవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది సర్పంచ్ తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా గూడపాటి కేశవరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు విరివిగా నాటాలని మొక్కలు మనకు అవసరమైన ప్రాణవాయువుని ఇస్తాయని పర్యావరణాన్ని కాపాడతాయని మానవాళి అభివృద్ధిలో మొక్కలు ఎంతో కీలకమైన పాత్ర వహిస్తాయని అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈకార్యక్రమంలో ,గ్రామ సర్పంచ్, గూడపాటి కేశవరావు,తదితరులు పాల్గొన్నారు.