గన్నవరం /బాపులపాడు :కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామ బీసీ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ప్రధానోపాధ్యాయురాలు జి ఎన్ శిరీష దేవి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మచిలీపట్నానికి చెందిన
గోరిపర్తివంశీకృష్ణపాఠశాలకు ముప్పై వేలరూపాయల విలువచేసే బెంచిలను విద్యార్థులు కూర్చోడానికి చేయించి ఇచ్చారని తెలియజేశారు.గోరిపర్తి వంశీకృష్ణ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.స్వతంత్ర దినోత్సవం రోజున విద్యార్థులు కొరకు చిరు ఆర్థిక సహాయాన్ని అందించడం ఎంతో సంతోషం ఉందని తెలియజేశారు.విద్యార్థినీ విద్యార్థులు ఎంతో భవిష్యత్తు కలిగిన వారు అని వారికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు విషయంలో తాను ఎప్పుడూ సందేహించనని మరిన్ని సౌకర్యాలకు తన వంతు సహాయం అందజేస్తాననితెలియజేశారు.
గ్రామ సర్పంచ్ కట్టు బోయిన నాగమణి,ఎంపీటీసీ
వెంకట్ నారాయణ,షేక్ రఫీ కలిసిబెంచిలను ఓపెన్ చేసి విద్యార్థులకు బహుకరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి ఎన్ శిరీష దేవి, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ అయినా తమ్మిశెట్టి.వెంకటేశ్వరమ్మ,వైస్ చైర్మన్ వేముల రమాదేవి,కాంప్లెక్స్ సి ఆర్ ఎం టి సతీష్ బాబు,గ్రామ ప్రముఖులు, పాల్గొన్నారు.