Subscribe Us

header ads

హీల్ పారడైజ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు


ఏలూరు /ఆగిరిపల్లి :ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో హీల్ పారడైజ్ ఆవరణలో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుక్కు గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ శ్రీమతి ముత్తవరపు మాధవి లతపాల్గొన్నారు.మాధవి లత మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్ర్యమని అట్టి స్వాతంత్ర్య ఫలాలను దేశ పౌరులందరు పొందుకునేందుకు విద్య ఒక్కటే పరిష్కారమన్నారు.విద్య దేశ ప్రగతికి, లౌకిక, సౌభ్రాతృత్వము నకు ప్రతీక నిలుస్తుందని అన్నారు.వివిధ పోటిల్లో విజేతలైన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందచేశారు.ఈ కార్యక్రమంలో హీల్ కార్యదర్శి శ్రీమతి తాతినేని లక్ష్మి, ఫెసిలిటీస్ డైరెక్టర్ టి. భాస్కర్, డైరెక్టర్లు మలినేని రంగప్రసాద్, వై.వి.ఎస్. చలపతి రావు, సి.ఈ.ఓ. కూరపాటి అజయ్ కుమార్,ప్రిన్సిపాల్ బి. సాయిబాబు,పాల్గొన్నారు.