విజయవాడ:బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులపై జరిగే హింసకాండను ఆపి వెంటనే కాపాడాలని విజయవాడ లో మహాదళ్ మరియు హిందూ సంఘాలు శనివారం నాడు విజయవాడ నగరంలో ధర్నా నిర్వహించారు.గత ఐదు
రోజుల్లో బంగ్లాదేశ్ లో 252 దాడులు హిందువుల మీద జరిగాయని నిన్నటి వరకు పక్కపక్కనే ఉన్నవారు ఈరోజు ఉన్మాదుల్లా తయారయ్యి పక్కింటి వారి మీదే దాడి చేయడం హేయమైన చర్య అని హిందూ సంఘాలు మండిపడుతూ విజయవాడ బి ఆర్ టి ఎస్ రోడ్డు శారద కాలేజ్ జంక్షన్ (ఆదిశంకరాచార్యుల సర్కిల్) దగ్గర నుండి ఫుడ్ జంక్షన్ మీదుగా సత్యనారాయణపురం ఎన్ ఆర్ పి రోడ్డు వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సెక్యులర్ దేశమైన బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చేయడం ఆడబిడ్డలను అమానుషంగా అత్యాచారం చేయడం చిన్నపిల్లలను సుత్తిలతో కొట్టి చంపేయడం చాలా బాధాకరమని ప్రపంచం మొత్తం దీని ఖండించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు హిందూ సంఘాలు, నాయకులు మరియు మహాదళ్ సభ్యులు పాల్గొన్నారు.