విజయవాడ: పదవి కావాలంటూకోర్టులో కేసు వేసే వ్యక్తి ఏవరన్నఉన్నారంటే అది కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డని విజయవాడ టిడిపి మాజీ ఫ్లోర్ లీడర్ గొట్టేటి హనుమంతరావు అన్నారు. శనివారం పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని కార్యలయంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించదని ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నట్టు భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. 175 సీట్లు గెలిచానని భ్రమపడ్డారని అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్నానని అనుకుంటున్నారని అందుకే ముఖ్యమంత్రికి ఇచ్చే సెక్యూరిటీ తనకు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారని అన్నారు.ప్రజలు ప్రతిపక్షగా కూడా పనికిరావు అని తీర్పు ఇచ్చారని ఐనా సిగ్గు లేకుండా ప్రతిపక్ష హోదా కావాలంటు కోర్టులో కేసు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు ముఖ్యమంత్రి చేయాలంటు కేసు వేస్తాడని అన్నారు.