Subscribe Us

header ads

కుల వృత్తుల వారికి అభ్యుదయానికి ప్రభుత్వం తూర్పాటిన అందిస్తుంది మంత్రి పార్థసారథి


 నూజివీడు /ఆగిరిపల్లి :ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చిన్నాగిరి పల్లి సింగన్నగూడెం లో గొర్రెలు మేకల పెంపకందార్ల అవగాహన సదస్సును నూజివీడు శాసనసభ్యులు రాష్ట్ర గృహ సమాచార మంత్రివర్యులు కొలుసు పార్థసారథి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.మంత్రి చేతులు మీదుగా గొర్రెలు మేకలకు వ్యాక్సిన్ అందించారు.మంత్రివర్యులు మాట్లాడుతూ గొర్రెలు
మేకల పెంపకందార్ల ఆర్ధికాభివృద్ధికీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 కోట్ల రూపాయల మాంసం ఉత్పత్తులు వ్యాపారం జరుగుతూ ఎంతో లాభంగా ఉన్న ఈ వృత్తిని మరింత గౌరవం లభించేలా మనలో మార్పు రావాలని మంత్రి సూచించారు.యాదవులలో పది నుండి పదిహేను శాతం మంది మాత్రమే గొర్రెల కాపరులుగా కల్లు గీత కార్మికులలో పది శాతం మాత్రమే ఆ వృత్తులలో ఉంటున్నారని అటువంటి వారి ఆర్థికాభివృద్ధికి రుణాలిస్తే దాని ద్వారా వారు అభివృద్ధి చెందుతారన్నారు. ఆ కులాలలో చదువుకున్నవారు సంతోషపడతారన్నారు.ఈసారి గ్రామీణ ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిందని,సమాచార సాంకేతిక రంగాన్ని అభివృద్ధి పరచిన ఆద్యుడు చంద్రబాబునాయుడని మంత్రి పేర్కొన్నారు.ఇదే సమయంలో గ్రామీణ వాతావరణంలో నివసిస్తున్న రైతులు ఎస్సీ లు బి.సి.లపై దృష్టి పెట్టి వారి జీవితాలలో మార్పు తీసుకురావాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు.దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ బలహీన వర్గాలు, దళితులు గ్రామీణాభివృద్ది
పైదృష్టి పెడతామని వారు చెప్పడం జరిగిందన్నారు.విజన్ కార్యాచరణలో బలహీనవర్గాలు దళితులూ కులవృత్తుల వారు ఏ విధంగా అభివృద్ధి చెందాలోపొందుపరుస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారని మంత్రి చెప్పారు. గ్రామీణాభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు త్రిమూర్తులనాయకత్వంలో తప్పకుండా బలహీన వర్గాలు దళితులకు మేలు జరుగుతుందని భరోసాను ఇస్తున్నానని మంత్రి పార్థసారథి చెప్పారు.గొర్రెల కాపరులు బ్యాంకుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం కల్పిస్తున్న రుణాలు కోసం ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు.గొర్రెల పెంపకం వ్యవసాయ అనుబంధమేనని వారిని చిన్నచూపు చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.కుల వృత్తులను అభివృద్ధి చేసుకుంటూ ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేయాలన్నారు.రానున్న ఐదవ సంవత్సరాలలో నూజివీడునియోజకవర్గంలో మూడు కోట్ల రూపాయలను గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘాలకు రుణాలు అందించేలా చర్యలుతీసుకుంటానన్నారు.మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పధకంలో గొర్రెలు మేకల పెంపకానికి షెడ్లు అందించడం జరుగుతుందని గొర్రెలు మేకల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా.జి.నెహ్రు బాబు,డిడి ఎన్.చంద్రశేఖర్,గొర్రెల, మేకల పెంపకందార్ల రాష్ట్ర అధ్యక్షులు దుద్దుకూరి వెంకట కృష్ణ,పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు ఏ డి ఎం.వెంకటేశ్వరరావు, బి.లక్ష్మీనారాయణ,ఏం రామారావు,సుచరిత, పలువురు వెటర్నరీ అసిస్టెంట్లు,సంఘ నాయకులూ,ప్రజాప్రతినిధులు,తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.