కృష్ణా /చల్లపల్లి: దేశంలోమహిళలు,చిన్నారులను కాపాడుకోవడానికి సోదరులు,కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ వారికి రక్షణ వలయంగా ఉండాలని ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు. చల్లపల్లిలో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన రక్షాబంధన్ వేడుకలలో సురేష్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.... మహిళలపై జరిగే ఆకృత్యాలపై ప్రభుత్వాలను, పోలీసులను విమర్శిస్తూ చేతులు దులుపుకోవడం సరికాదన్నారు.మహిళల పై జరిగే దారుణాలను అడ్డుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశంలో మహిళల హక్కులను కాపాడుతూ మహిళలకు నిత్యం రక్షణగా ఉండేలా రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సురేష్ బాబు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నేత మేడేపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.