చింతలపూడి :పేరుకే ఆ గ్రామం ఫైలట్ ప్రాజెక్టు గ్రామంగా ఎపిక్ అయింది పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాల్సిన గ్రామ కార్యదర్శి నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో అభం శుభం తెలియని ప్రజలు అనారోగ్యంపాలై మంచానపడి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులతో ప్రయివేటు ఆసుపత్రిల చుట్టూ తీరుగుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇంతకు ఆ గ్రామం ఎక్కడ పూర్తి వివరాలలోకి వెళ్లితే...
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యర్రంపల్లి గ్రామంలో 4వేల 5 వందల మంది ప్రజలు నివశిస్తున్నారు. రోజు చాలా మంది ప్రజలు అనారోగ్యంపాలౌతుంటారు. కారణం పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోవడమే, గ్రామకార్యదర్మి ఫలితం శూన్యం.
కనీసం గవర్నమెంట్ డాక్టర్ కూడా లేని గ్రామంలో 5 గురు. ఆర్.ఎం.పి, డాక్టర్లు జేబులు నింపుకునే పరిస్థితి ఏర్పడింది. గత ఐదు నెలల నుండి డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా ఇప్పటివరకు ఒకరి తర్వాత మరి ఒకరికి వస్తూనే ఉంది గత కొన్ని రోజుల కిందట డి ఎం హెచ్ ఓ గారు వచ్చి పరిశీలించి నా ఇప్పటివరకు ఇంకా తగ్గనే లేదు దీనంతటికీ గల కారణం పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం మురికి నీరు నిల్వ ఉండడం వల్ల ఇలా జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు.