తెలంగాణ రాష్ట్రం ,రాజన్న సిరిసిల్ల జిల్లా ,వేములవాడ మండలం వేములవాడ గ్రామానికి, చెందిన చిట్టి శివ కుమారి భర్త రామారావు, వయసు 54 సంవత్సరాలు ,కులం కొప్పులు వెలమ, అనువారు శారీ ఫంక్షన్ నిమిత్తం ఏలూరు కొత్తపేటలోని వారి చుట్టాలు ఇంటికి వచ్చినట్లు, ది.18-08-2024వ తేదీ ఉదయం 11 గంటలకు ఫంక్షన్ కు వెళ్ళు నిమిత్తం కొత్తపేట నుండి ఆటో లో చలసాని గార్డెన్స్ కల్యాణ మండపం కు వారి యొక్క విలువైన అభరములు బట్టలు కలిగిన బ్యాగును ఆటోలో పెట్టుకుని ఆటోలో నుంచి కళ్యాణ మండపం వద్ద దిగినట్లు వారి యొక్క బ్యాగును ఆటోలో మర్చిపోయినట్లు సదరు బ్యాగులో 80 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు బట్టలు ఉన్నట్లు ఏలూరు త్రి టౌన్ పోలిస్ స్టేషన్ నందు పోయిన వారి బంగారు ఆభరణములు కలిగిన బ్యాగును వెతికి అప్పగించవలసినదిగా పిర్యాదు చేసినారు.
ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు గారి యొక్క ఆదేశాలపై ఎస్ఐ ప్రసాద్ గారు వారి యొక్క సిబ్బంది వెను వెంటనే ఏలూరు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వారిని సంప్రదించి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆటో యొక్క కదలికను గమనించి సదరు ఆటోలో మర్చిపోయిన బ్యాగును స్వాధీనం చేసుకున్నట్లు,
తన యొక్క ఆటోలో ఫిర్యాదుదారులు బ్యాగ్ మర్చిపోయిన విషయాన్ని కూడా ఆటో డ్రైవర్ గ్రహించలేదని,
విలువైన వస్తువులు ఆభరణాలు కలిగి ఉన్నటువంటి బ్యాగ్ను ఫిర్యాదుదారులకు గంటల వ్యవధిలో అప్పగించిన నేపథ్యంలో ఈ కేసులో త్వరితగతిన ఛేదించిన ఎస్సై అజయ్ కుమార్ ను మరియు హెడ్ కానిస్టేబుల్ విజయ రాజు మరియు రఘు లకు రివార్డులు ఇస్తామని, విషయం తెలియగానే ఏలూరు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ లీల కృష్ణ వెంటనే స్పందించి అతని యొక్క సహాయ సహకారాలు అందించిన నేపథ్యంలో ఆటో యూనియన్ వారిని అభినందించిన ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ తెలియ చేసినారు.