Subscribe Us

header ads

వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఇద్దరు వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేత..


మంజీర గళం (ప్రతినిధి) :అమలాపురం 

ఒక్కొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ ఖరీదు1.5 లక్షలు.. 

అమలాపురం కలెక్టరేట్ లో స్కూటర్లను అందించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ .

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఇద్దరు వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు.కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ ఇద్దరికీ శనివారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొత్తపేట మండలం వానపల్లి గ్రామ పంచాయతీ సంఘంపాలెం కు చెందిన ఇళ్ల భగవాన్(దివ్యాంగుడు), తండ్రి ఇళ్ల శ్రీనివాసరావు, కు కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన చింతపల్లి నాగమల్లేశ్వర కిరణ్ ,తండ్రి వెంకటేశ్వరరావు ,కు ఒక్కొకటి 1.5 లక్షల రూపాయలు విలువ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను అందచేశామన్నారు. వీరిరువురికి జిల్లా రవాణా అధికారి ఆధ్వర్యంలో డ్రైవింగ్ పరీక్ష నిర్వహించి సక్రమంగా డ్రైవింగ్ చేస్తున్నారని నిర్ధారణకు వచ్చిన తర్వాత వారు కోరిన రంగు గల స్కూటర్లను అందజేయడం జరిగిందన్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. రోడ్డు నియమాలను పాటించాలని సూచించారు.

లబ్ధిదారులు ఇద్దరు మాట్లాడుతూ తమపై దయతో అడగగానే ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇస్తామని హామీ ఇచ్చిన మరుసటిరోజే అందజేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిషాంతి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు,కొత్తపేట రెవిన్యూ డివిజనల్ అధికారి వి సత్యనారాయణ, జిల్లా రవాణా అధికారి అశోక్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.