(మంజీర గళం ప్రతినిధి), సాలూరు
ఢిల్లీ లో కేంద్ర స్త్రీ,శిశు శాఖ మంత్రి అన్న పూర్ణ దేవిని,రాష్ట్ర గిరిజన శాఖ ,స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి జి.సంధ్యా రాణి భేటీ అయ్యారు.
సాక్ష్యం అంగన్వాడీ సెంటర్ అభివృద్ధి కోసం కోరగా భారత ప్రభుత్వం ద్వారా 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆమె తెలిపారు… ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా 20 కోట్లు మంజూరు చెయ్యడం జరిగింది..
జన్ మన్ అంగన్వాడీలకు గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి కోసం 20 కోట్లు భారత ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు..
డబుల్ పోర్టల్ లో ఫేషియల్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ ను ఒక పోర్టల్ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ చేస్తే ఉద్యోగులకు పనిభారం తగ్గుతుందని సూచిస్తే దానికీ కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి సానుకూలం గా స్పందించారు..
బాలామృతం కోసం తెలంగాణకి ప్రతి సంవత్సరం మనం 240 కోట్లు చెల్లిస్తున్నాం..ఇప్పుడు ఈ సంవత్సరం నుండి మన ఆంధ్రలో ఎపి ఫుడ్స్ ఫ్యాక్టరీ పెట్టి మనమే తయారుచేసుకుంటే బాగుంటుందని, దానికి 80 కోట్లు అంచనా ఉందని కోరగా, దానికీ కేంద్ర మంత్రివర్యులు అన్నపూర్ణాదేవి సానుకూలం గా స్పందించారు..
అరకు కాఫీని ఇవ్వగా… ముచ్చట పడి కేంద్రమంత్రి తీసుకున్నారు… వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసి తిరుపతి రావాలనుకుంటున్నానని తెలిపారు…
ఎంతో అభిమానంతో మాట్లాడి, నిధులు మంజూరు చేసిన కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ప్రిన్సిపాల్ సెక్రెటరీ సూర్య కుమారి కూడా పాల్గొన్నారు.