Subscribe Us

header ads

విద్యుత్ సంస్కరణల దోపిడీ నివారించాలి!


   (మంజీరగళం ప్రతినిధి) :- చాట్రాయి 

 ఉమ్మడి రాష్ట్రంలో 24 సంవత్సరాల క్రితం చంద్ర బాబు పాలనలోవిద్యుత్ సంస్కరణలకు వ్యతి రేకంగా పోరాడి అశువులు బాసిన విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ, బాలస్వామి లకు 10 వామపక్ష పార్టీ ల ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ భవన్ లో నివాళులర్పించి నట్లు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ తెలియ జేశారు.వారిత్యాగాలఫలితంగా నేటి వరకు ఉచిత విద్యుత్తు రాష్ట్రంలో అమలు జరుగుతోందని కొనియాడారు. మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్క రణలను చేపట్టాలని చూస్తే భారతదేశ వ్యాప్తంగా రైతాంగం తిరుగుబాటు చేయడం ద్వారా వెనక్కి తగ్గారన్నారు. దొడ్డిదారిన మరలతీసుకొచ్చేప్రయత్నాలను చేస్తున్నారని హరి నాథ్ విమర్శించారు. కేంద్రంలో చట్టం కాక ముందే రాష్ట్రంలో 22 జీవో తెచ్చి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు సిద్ధమయ్యారని అనంత పురం రైతాంగం కర్నూలు రైతాంగం ప్రతిఘటించారని హరినాథ్ తెలిపారు.

 సర్చార్జీలపేరుతో ,యూజర్ చార్జీల పేరుతో నేడు మరల విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు సిద్ధమయ్యా రన్నారు.పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించు కునే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్మార్ట్ మీటర్లు గృహఅవసరాలకు వ్యవసాయానికి బిగించవ ద్దని హరినాథ్ హెచ్చరిం చారు. నీతీ ఆయోగ్ సమావేశంలో చర్చించిన విజన్ 2047 పేరుతో మరల చంద్రబాబు వరల్డ్ బ్యాంక్ ఏజెంట్గా పాలన కొనసాగిస్తేపదివామపక్షాలు వ్యతిరేకిస్తాయని చెప్పారు.సిపిఎం నాయ కులు వైవీ గారు అధ్యక్షత వహించగా సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు రావు, సిపిఐ నాయకులు అక్కినేని వనజ,సిపిఐ(ఎంఎల్)నాయకులు జాస్తి కిషోర్ బాబు, సిపిఐ (ఎంఎల్)న్యూ డెమో క్రసీ నాయకులు పోలారి,ఎస్ యు సి ఐ నాయకులు సుధీర్ ఆర్ ఎస్ పి నాయ కులు జానకి రాములు పాల్గొని ప్రసంగించారు.