మంజీరగళం ప్రతినిధి :బాపట్ల
బాపట్ల జిల్లా : బాపట్ల నియోజకవర్గంలో పొలిటికల్ కరప్షన్ ఉండదు అని ఎమ్మెల్యే పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే నా దృష్టికి తీసుకురండి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ పేర్కొన్నారు. బాపట్ల టౌన్ లోని హోటల్ సీటెల్ లో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం మొత్తం సంక్షేమం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతుందన్నారు.రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, డిప్యూటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చిత్రపటాలు కూడా ఉంటే బాగుంటుంది ఆ పార్టీల కార్యకర్తల అభిప్రాయ పడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ఎన్డీఏ లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఐదు సంవత్సరాలలో మరింత అభివృద్ధి చేసే విధంగా నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందన్నారు.
గడచిన మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పరిమితులు లేకుండా నిధులు మంజూరు చేస్తు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధులను అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు.
రాజదాని నిర్మాణం కు వేల కోట్లు మంజూరు చేసి ప్రతి ఇంటికి మంచి నీరు అందించే విధంగా ముందుకు వెళుతున్నామన్నారు. జనసేన, బిజెపి, తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది
కేవలం ఐదు సంవత్సరాలు పాలించడానికి కాదు అని అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఏపీ పోటీపడే విధంగా అభివృద్ధి చేస్తామని హితవు పలికారు.
10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటేనే రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నాశనం చేసి కార్యకర్తలు లాగా పోలీసులను వాడుకున్నారన్నారు. భారతీయ జనతా పార్టీ వారధి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్ర పార్టీ కార్యాలయం, జిల్లా పార్టీ కార్యాలయం, నియోజవర్గం పార్టీ కార్యాలయంలో వారధి కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, జిల్లా నాయకులు ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని పరీక్షించే మార్గం చూపిస్తామని అన్నారు.సెప్టెంబర్ 2 నుంచి బిజెపి పార్టీ క్రియాశీలక, సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నమాని
ప్రతి ఒక్కరు బిజెపి పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలని కోరారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని దోసు కుని సంపాదించిన డబ్బులు వివిధ మార్గాల్లో పెట్టారన్నారు. బాపట్ల లో అధికారులు ఎవరైనా ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తే వారిపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజలు ఎవరైనా నా దృష్టికి వస్తే స్వయంగా నేను ప్రజల కోసం పోరాటం చేస్తాను అని ప్రజలు ఎవరు కూడా అధికారులకు భయపడి డబ్బులు ఇవ్వ వద్దన్నారు. గతంలో వేసిన లేఔట్లను చూపించి లేఅవుట్ యజమానులను, కొనుగోలు దారులను, ఇల్లు కట్టుకునే వారిని బెదిరించాలని చూస్తే సహించేది లేదన్నారు. ప్రజల నుంచి లంచాలు వసూలు చేయాలని ఏ అధికారి చూసిన ఏసీబీకి పట్టిస్తానని ప్రజలు కూడా అధికారులకు లంచాలు ఇవ్వ వద్దు లంచం తీసుకోవడం ఎంత తప్పో ఇవ్వడం కూడా అంతే తప్పు అన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలు స్వచ్ఛందంగా అధికారులు ద్వారా పనులుచేయించుకోవాలన్నారు.కూటమి ప్రభుత్వంలో ప్రజలకు గౌరవమైన పాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ నారాయణ, బి కృష్ణ చైతన్య,పెర్లి సునీల్ కొండ రెడ్డి, అనిల్,రమేష్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.