(మంజీరగళం ప్రతినిధి) :ఆగిరిపల్లి
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి ఎంపీడీవో పి శంకర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకటో తేదీ ఆదివారం వచ్చి నందు వలన ఆగస్టు 31వ తేదీన
అందజేయమని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలియపరిచారు.31వ తేదీనే ప్రభుత్వపు అధికారులు మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షనలను అందిస్తారని ఎక్కడన్నా కొన్ని పెన్షన్లు మిగిలినట్లయితే మరల సోమవారం వాళ్ళకి అందజేస్తారని తెలియపరిచారు.అదేవిధంగాఈరోజువనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పంచాయితీలకు 200 చెట్లను అందించడం జరిగిందని తెలియపరిచారు.ప్రజలు తమ పంచాయతీ కార్యాలయాల వద్ద ఈ చెట్లను ఉచితంగా అందిస్తం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీటిలో పళ్ళు మరియు నీడనిచ్చే మొక్కలు ఉంటాయని తెలిపారు.