ఏలూరు/ఆగిరిపల్లి:ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కొవ్వలి బాబురావు అధ్యక్షతన ముఖ్య అతిథి నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సంయోజక్ కన్వీనర్ జి. ఆర్.కె.రంగారావు పాల్గొన్నారు.కొవ్వలి బాబూరావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యదినోత్సవాన్ని ఘనంగాజరుపుకునేందుకు హర్ ఘర్ తిరంగాను నినాదంతో ప్రతి ఇంటి పైన జెండాని ఎగరవేసి దేశభక్తిని చాటాలని తెలిపారు.జి.ఆర్.కె.రంగారావుమాట్లాడుతూభారతీయ జనతాపార్టీ జాతీయ స్థాయి నాయకత్వం రానున్నఆగస్టు 15 కి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా యావత్తు దేశం ఘనంగా సంబరాలుజరుపుకోవాలనే ఉద్దేశంతోతద్వారాజాతీయత మరియు దేశభక్తిని బలోపేతం చేయాలనే భావంతో ప్రకటించిన కార్యక్రమాన్ని వివరిస్తూ హర్ గర్ కి తిరంగా (ఇంటింటికి జాతీయ జెండా)అనే నినాదంతో జాతీయ జెండాల పంపిణీతిరంగా యాత్ర ప్రతి సందునా-గొందినా జాతీయ జెండాలతో ప్రదర్శన స్వాతంత్ర ప్రకటించటానికి ముందు దేశ విభజన సమయంలో జరిగిన విషాదం,స్వాతంత్ర ఉద్యమంలో అసువులు బాసిన మహనీయుల విగ్రహాల వద్ద,సంబంధించిన ప్రదేశాలలో స్వచ్ఛభారత్ నిర్వహణ మరియుఆగస్టు 15న జాతీయ జెండా వందనం-పార్టీ రహితంగా కలసి వచ్చిన అందరినీ కలుపుకొని జరుపుకోవాలని తెలియజేయడం జరిగినది.ఆగిరిపల్లి మండల ఇన్చార్జి ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులైన శ్రీమాటూరి ప్రసాద్ మాట్లాడుతూ
జాతీయ జెండా రూపొందించబడిన క్రమం మరియు దాని ప్రాముఖ్యతనవివరించటం జరిగింది.ఆగిరిపల్లి మండల భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులైన శ్రీ జల సూత్రం శేషగిరి రావు ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతనుతెలియపరచడం జరిగినది.ఆగిరిపల్లి మండల భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు తోట వెంకట రాంబాబు ఇప్పుడు నెలకొని ఉన్న సమాజంలో జాతీయ జెండా-స్వతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడం జరిగినది.ఈకార్యక్రమంలో బిజెపి ఉపాధ్యక్షులు రెడ్డి రామారావు,తిరుమల శెట్టి వెంకట.సత్యనారాయణ,తోటరాంబాబు,జలసూత్రం శేషగిరి రావు,మోగదాటి వెంకటేశ్వరరావు,మండల కిషన్ మోర్చా అధ్యక్షుడు రెడ్డి స్వామి,కార్యదర్శులు సత్తెనపల్లి.రామయ్య,సంగా రంగారావు,కోశాధికారి సుంకర శ్రీనివాసరావు, చెక్కిరాల.రామకృష్ణ,కుప్పాల శ్రీనివాసరావు,గోళ్ళ కొండలరావు,ముస్లిం మైనార్టీ షేక్ సలీం భాషా, మండల యువమోర్చా అధ్యక్షుడు జంగా పవన్ కోటి,కొవ్వలి.రవి,కూరాకుల రత్తయ్య, రాణి మేకల రామాంజనేయులు,ధూపాటి వీరయ్య,పాల్గొన్నారు.