Subscribe Us

header ads

రామనామ స్మరణతో ఉప్పొంగిన గోపాలపురం


 ఏలూరు /ఆగిరిపల్లి:ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం గోపాలపురం గ్రామంలో హనుమత లక్ష్మణ సీత సమేత కోదండ రాముని విగ్రహాలను అంగరంగ వైభవంగా ప్రతిష్టించడం జరిగినది.వేదాంతం శేషుబాబు,రొంపిచర్ల జనార్ధన్ బట్టర్ వారి ఆధ్వర్యంలో హోమ పూజ కార్యక్రమములు, సుముహర్త మునకు విగ్రహ,విమాన శిఖర, ధ్వజస్తంభ, ప్రతిష్ట కార్యక్రమము కళావాహన, గో పుష్క దర్శనం,సర్వ దర్శనం,పూర్ణాహుతి,32 జంటలతో శాంతి కళ్యాణంజరిపించడం జరిగినది.రామాలయ ప్రతిష్టా కార్యక్రమంలో నూజివీడు శాసనసభ్యులు రాష్ట్ర గృహ సమాచార శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి విచ్చేయగా ఆలయ కమిటీ సభ్యులు,వేద పండితులు పూర్ణకుంభంతో రాష్ట్ర మంత్రివర్యులు స్వాగతం పలికి వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేష వస్త్రమును కప్పి ఆశీర్వదించారు.అనంతరం తీర్థ ప్రసాద తీసుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి భక్తులు అశేషంగా పాల్గొన్నారు.