ఖమ్మం :బహుజన నాయకుడు బహుజన వీరుడు మొట్ట మొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం ట్యాంక్ బండ్ దగ్గర గల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర ఉపేంద్ర సాహూ జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరరావు సంయుక్తంగా మాట్లాడుతూ... ఉమ్మడి వరంగల్ జిల్లా ఖిలాషాపూర్ గ్రామంలో ఆగస్టు 18,1650 లో కల్లు గీత గౌడ కులంలో జన్మించి తల్లి కోరిక మేరకు కులవృత్తిని చేపట్టినప్పటికీని నాటి గోల్కొండ పాలకులు కుతుబ్ షాహి రాజుల ఆగడాలను సహించలేక కుల వృత్తిని వదిలి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాటం చేశాడు.
బహుజన కులాలను సంఘటితం చేసి తురుష్కుల సైన్యాలను ఓడించి భువనగిరి కోటను స్వాధీనపరచుకొని సుమారు 30 సంవత్సరాలు పరిపాలన సాగించాడు.బహుజన కులాలన్నిటికీ సర్దార్ సర్వాయి పాపన్న గారి జీవితం పోరాటం సాధించిన విజయాలు ఎంతో స్ఫూర్తిదాయకం.కావునా నేటి తెలంగాణ బహుజన సమాజం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దారెల్లి రమేష్ పాలేరు అసెంబ్లీ అధ్యక్షులు మట్టే నాగేశ్వరరావు మధిర అసెంబ్లీ అధ్యక్షులు గంధం వంశీ జిల్లా నాయకులు కొమ్ము పూలే ఉసికల నవీన్ నల్లగట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.