ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి సూచనలు మేరకు మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండల ప్రాధమిక వైద్యాధికారి డాక్టర్ మణిబాబు, రంగాపురం ఆరోగ్య సిబ్బంది, గురుకుల అంబేద్కర్ స్కూల్, మరియు కస్తూరిబా బాలికల జూనియర్ కాలేజీ ని సందర్శించారు.
రెండు హాస్టల్లో ని ప్రతిగదిని పరిశీలించారు. వాటర్ ట్యాంక్ లను, వంటసాలలను, లెట్రిన్, బాత్రూం గదులను పర్యవేఖించి ఈగలు, దోమలు రాకుండా తగు సలహాలు తెలియజేసారు.
విద్యార్థిని లకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురుంచి, దోమలు, నీటిద్వారా వచ్చే వ్యాధులు గురుంచి బాలికలకు అవగాహన కల్పించారు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో, "నీరు నిల్వచేసే గుంట లో "లార్వా "ఉన్నట్టు గుర్తించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్. మణిబాబు, స్కూల్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది శిరోతేజస్విని, వాణి, సురేష్, ఆశ వర్కర్స్ పాల్గొన్నారు