Subscribe Us

header ads

గ్రామ సభల ద్వారా గ్రామ సమస్యలు పరిష్కారం


 (మంజీరగళం ప్రతినిధి ) గోకవరం :

గోకవరం మండలం కృష్ణుని పాలెం పంచాయతీ కార్యాలయం వద్ద ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగిందని కృష్ణుడు పాలెం సర్పంచ్ రౌతు ఆదిలక్ష్మి జోగేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కృష్ణుడి పాలెం పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని గ్రామల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళతామని అలాగే అలాగే స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దృష్టికి పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు దృష్ట్యా వారితో కలిసి అభివృద్ధిలో భాగం అవుతామని తెలియజేశారు. గ్రామ సభకు హాజరైన ప్రజానికం ముఖ్యంగా ఉపాధ హామీ పనులు ద్వారా పంట కాలువల పుడుకుల తీతలు తీయించాలని మరియు సిసి రోడ్లు,డ్రైనేజీలు నిర్మాణం గ్రామాల్లో చాలా వసరమని తెలియజేశారాని తెలిపారు.ఈ కార్యక్రమంలోసచివాలయ సిబ్బంది,రెవెన్యూ వారు, కృష్ణుడి పాలెం పంచాయతీ నాయకులు గ్రామ ప్రజలుపాల్గొన్నారు.