నూజివీడు
నూజివీడు పట్టణం శ్రీవాణి పంక్షన్ హాలునందు ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నూజివీడు మరియు విసన్నపేట వైద్యుల ఆత్మీయ సమావేశానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి ఈ సమావేశంలో వైద్యులు తాము పడుతున్న ఇబ్బందులను మంత్రివర్యుల దృష్టికి తీసుకుని రాగ మంత్రివర్యులు తగు జాగ్రత్తలు పలు భద్రత పరమైన చర్యలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారితో మాట్లాడి వైద్యులకు కావలసిన పూర్తి భద్రతా చర్యలు త్వరలోనే చేపడతామని హామీ ఇచ్చిన మంత్రివర్యులు వైద్యులు మాట్లాడుతూ ఇటీవల వైద్యుల పై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని మాకు రక్షణ లేకుండా పోయిందని ముక్యంగా ప్రజలు ఎక్కువ బిల్స్ వేస్తున్నామని త్వరగా వైద్యం అందించక సరైన వైద్యం చేయక పేసెంట్ మరణించాడని పలు రకాల కారణాలతో మా పై దాడి చేయడం హాస్పటల్లో ఆస్తిని పాడు చేయడం జరుగుతుందని అందువల్ల మేము రాత్రి 7 గంటలకే వైద్యం చేయడం నిలిపివేయ వలసి వస్తుందని ఒక్కోసారి ఎమర్జెన్సీ కేసులకు వైద్యం అందించడం కష్టమవుతుందని
మున్సిపల్ శానిటేషన్ హాస్పటల్ పరిసరాల ప్రాంతాల్లో సక్రమంగా చేయక రోగులు త్వరగా కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ఇకనుండి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతీ రోజు హాస్పటల్ పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బందితో శానిటేషన్ చేయించాలని మంత్రివర్యులకు విజ్ఞప్తి చేశారు హాస్పటల్ ఏర్పాటుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ మరియు ప్రభుత్వ పరమైన పర్మిషన్స్ త్వరగా ఇప్పించ వలసిందిగా కోరారు హాస్పటల్ పర్మిషన్ విషయంలో కార్పోరేట్ హాస్పటల్ తరహాలో కాకుండా కొంచెము తక్కువ పీజులకే కొంచెము త్వరగా పూర్తి చేయవకసిందిగా కోరారు మరియు వైద్యులు అందరూ ప్రాణాలు పోయడానికే ఉన్నాము కానీ తీయడానికి కాదని సరైన సమయంలో వైద్యమ అందుకే ఒక్కొక్క సారి ప్రమాదాలు జరుగుతాయని వైద్యులమైన మమ్మల్ని అర్ధం చేసుకోవాలని కోరారు మంత్రివర్యులు మాట్లాడుతూ వైద్యులకు పూర్తి భద్రత నాది అని పోలీసు వారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి పలు చూచనలు ఇస్తానని మరియు ప్రతిరోజు హాస్పటల్ పరిసరప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బందితో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి శానిటేషన్ చేయిస్తామని హామీ ఇచ్చారు వైద్యులు కూడా పేసెంట్స్ పట్ల కొంచెం స్నేహభావంతో ఉండాలని వైద్యం పట్ల అవగహన కల్పించాలని మరియు తరసుగా గ్రామాలలో మెడికల్ క్యాంప్ నిర్వహించి ప్రజల్లో వైద్యం పట్ల కొంచెము అవగహన కల్పించాలని కోరారు నూజివీడు నియోజకవర్గములో పేద మధ్య తరగతి కుటుంభాలు ఎక్కువ ఉన్నాయని ఎక్కువగా పేదవారు దగ్గరలో ఉన్న హాస్పటల్కి వస్తుంటారని వారికి అవగహన కల్పించి తక్కువ పీజులకే వైద్యం అందించాలని చూసించారు మీరు కోరిన విధంగా ప్రభుత్వ పరమైన అన్ని అనుమతులు త్వరితగతిన జరిగేలా చూచనలు ఇస్తానని తెలియ జేశారు అలాగే నూజివీడు పట్టణాన్ని ఒక మోడల్ పట్టణముగా తీర్చిదిద్దుతానని త్వరలో రోడ్లు శానిటేషన్ అండర్ డ్రైనేజీ వ్యవస్త వీధి దీపాలు మార్కెట్ యార్డ్, అన్ని మౌలిక సదుపాయాల చేసి ఒక సంవత్సరంలో మోడల్ పట్టణముగా తీర్చిదిద్దే బాధ్యత నాది అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టరు, విజయ్ డాక్టరు రవికిరణ్, డాక్టరు, శురీష, డాక్టరు, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు