Subscribe Us

header ads

ఖాకీ యూనిఫామ్ మాటున ఖాటిన్యమే కాదు కరుణ కూడా దాగి ఉంటుందని నిరూపించిన తోట్ల వల్లూరు ఎస్సై

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు

 గొర్రెపోతుల దాడిలో గాయపడిన బాలుడికి అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణాపాయ పరిస్థితి నుండి తప్పించిన తోట్లవల్లూరు ఎస్సై అర్జున్ గారిని జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర రావు ఐపీఎస్ గారు అభినందించారు. వివరాల్లోనికి వెళ్తే తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెనమకుర్రు గ్రామానికి చెందిన గంట ధర్మేంద్ర మూడు సంవత్సరాల వయసు కలిగిన తన కుమారుడైన అభినయ్ ను వెంటబెట్టుకొని వీధిలోనికి వెళ్ళాడు. అదే సమయంలో రెండు గొర్రెపోతులు పరస్పరం దెబ్బలాడుకుంటూ అక్కడే ఆటలాడుకుంటున్న ఆ బాలుడు మీదకి దూసుకు వచ్చాయి. ఆ రెండు గొర్రెపోతుల మెడలో ఉన్న తాడు ఆ బాలుడికి చిక్కుకొని సుమారు 100 మీటర్ల పరిధి వరకు రోడ్డుపై ఈడ్చుకొని వెళ్ళిపోగా, ఆ గ్రామంలో ఉన్న స్థానికులు వాటిని నిలువరించి బాలుడిని వాటి దాడి నుండి తప్పించారు.

 అయితే గొర్రెపోతులు వేగంగా ఈడ్చుకుపోవడంతో బాలుడి శరీరం అంత రక్త గాయాలు, తన తలకు తీవ్రగాయం అయ్యి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న అభినయ్ ను ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకొని వెళ్లారు. వెంటనే సమాచారం తెలుసుకున్న తోట్లవల్లూరు ఎస్సై ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి బాలుడు యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చూడగా, ఆ బాలుడికి శరీరం అంత అయిన గాయాలకు తీవ్రంగా రక్తం కోల్పోయాడు. రక్త దాతల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల బాధను గమనించిన ఎస్ ఐ గారు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న బాలుడికి రక్తదానం చేసి తన మానవత్వాన్ని కనబరుచుకున్నారు.