Subscribe Us

header ads

శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్


  (మంజీరగళం)ప్రతినిధి:ఏలూరు

ఏలూరుజిల్లా నూజివీడు మండలం చిన్నరావిచెర్ల గ్రామంలో జరిగిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. మంత్రి, ఎంపీలకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని శ్రీకృష్ణ మందిరంలో విశేష పూజలు చేశారు. శ్రీ కృష్ణుని వేషధారణ చేసిన చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు.. తొలుత గ్రామంలోని నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కృష్ణ భగవానుని అనుగ్రహం తో ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.