(మంజీరగళం)ప్రతినిధి:జంగారెడ్డిగూడెం
ఏలూరుజిల్లా సోమవారం ఉదయం జంగారెడ్డి గూడెం లో మానవతా మూర్తి ఆఫీసు నందు మానవతా సంస్థ జంగారెడ్డి గూడెం మానవతా సంస్థ నెలవారీ సమావేశం మానవతా అధ్యక్షులు ఆయినాల వెంకట రమణమూర్తి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో సెప్టెంబర్ నెల సంబందించి కార్యక్రమములు గురించి చర్చించి మండలంలో ఎవరైనా మరణించిన వారి ఇంటికి వెళ్లి మానవతా సంస్థ తరపున ఆత్మీయ సహకారం అందించాలని తీర్మానం ఆమోదం తెలిపారు.ఈ సందర్భంగా మండలం,మరియు పట్టణం లో ప్రతి ఒక్కరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మరియు మథర్ దెరిస్సా జయంతి శుభాకాంక్షలు మానవతా సంస్థ తరపున తెలిపినారు.
ఈ సమావేశంలో మానవతా సంస్థ చేసే సేవలు నచ్చి జంగారెడ్డి గూడెం నకు చెందిన ప్రముఖ బట్టల వ్యాపారి శ్రీ కందుల పాటి సురేష్ కుమార్ వారి కుటుంబ సభత్వం రూ.1,200/- చెల్లించి సభ్యులు గా చేరినారు.వీరికి రీజియన్ చైర్మన్ త్రిపుర రమేష్ సభ్యత్వం రశీదు అందజేయడం జరిగింది.వారికి మానవతా సంస్థ తరపున దన్యవాదములు తెలియచేసినారు.ఈ విధముగా జంగారెడ్డి గూడెం మండలంలో మరియు పట్టణం లో ఉన్న ప్రతి ఒక్కరూ మానవతా సభ్యులుగా చేరాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహంకాళి రంగ ప్రసాద్,మానవతా మండల చైర్మన్ శ్రీ ఆకుల ధర్మరాజు,జాయింట్ సెక్రటరీ పల్లి వెంకటరెడ్డి,ఆడిట్ కమిటీ చైర్మన్ ద ల్లి కేదారేశ్వర రెడ్డి,ఈ సి సభ్యులు ద ల్లి రామాంజనేయ రెడ్డి, భరద్వాజ రామకృష్ణ,ఆత్మీయ సహకార కమిటీ కన్వీనర్ గద్దె సత్యనారాయణ,మాజీ అధ్యక్షులు శ్రీ యెలికే తాతా రావు,శ్రీ గంధం గోపాలకృష్ణ, పి. కృష్ణ మూర్తి, కర్పూరం వెంకన్న బాబు పాల్గొన్నారు.