(మంజీర గళం ప్రతినిధి ) తిరువూరు.
తిరువూరు మండలం,లక్ష్మీపురం, గ్రామం,ఎం.పీ.యు.పి,పాఠశాల నందు తెలుగు భాషా దినోత్సవం మరియు క్రీడా ఎన్టీఆర్ జిల్లా వార్త!దినోత్సవం ను పాఠశాల లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది కి మాత్రమే పరిమితమైన తెలుగును గ్రాంథిక భాష నుండి సామాన్యులకు కూడా తేలికగా చేరువయ్యే వ్యవహారిక భాష కోసం కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారు మరియు మన జాతీయ క్రీడ హాకీ లో ఒలింపిక్స్ లో వరుసగా బంగారు పథకాలు సాధించి దేశానికి గౌరవాన్ని తెచ్చి పెట్టిన మేజర్ ధ్యాన్ చంద్ జీవిత విశేషాలను విద్యార్థులు కు వివరించడం జరిగింది.. ఈ సందర్భంగా విద్యార్థుల కు తెలుగులో మాట్లాడే పోటీ మరియు వివిధ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది.. ప్రధానోపాధ్యాయులు యం.హరికృష్ణ, ఉపాద్యాయులు సుజాత కుమారి,పద్మలత, శ్యామల తదితరులు పాల్గొన్నారు