నూజివీడు /ఆగిరిపల్లి :ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం గోపాలపురం గల ఎన్.ఆర్.ఐ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సి.యస్.ఇ. విభాగం ఆధ్వార్యంలో మరియు కోడ్ గ్నాన్ డెస్టినేషన్ ఐ.టి. సొల్యూషన్స్ సౌజన్యంతో రెండు రోజుల జాతీయస్థాయి కోడింగ్ కాంపటేషన్స్ అయినటువంటి హాకతాన్ 4.0 సెప్టెంబర్ 20, 21వ తేదీన కళాశాల అవరణలో నిర్వహించబడుతున్నట్లు కళాశాల ఛైర్మన్ డాక్టర్ ఆర్. వెంట్రావు తెలియజేసారు.రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ మరియు డిగ్రీ విద్యార్ధులు బృందాలుగా ఏర్పడి ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్, డేటా సైన్స్, ఐ.ఓ.టి. మరియు వేస్ట్ మానేజ్మెంట్స్ వంటి అంశాలపై కోడింగ్ చేసి సమాజంలో ఉన్న ఎన్నో నిత్య సమస్యలకు పరిష్కారం అన్వేషించే ఈ యొక్క పోటీలకు ఎన్.ఆర్.ఐ. శ్రీకారం చుట్టిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. నాగభాస్కర్ తెలియజేసారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పోస్టర్ లాంచ్ అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ జి. సాంబశివరావు, ప్రోగ్రామ్ కన్వీనర్ డాక్టర్ డి. సునీత, ఐ.టి. విభాగాధిపతి డా॥ జె. రాజేంద్ర ప్రసాద్ మరియు ప్లేస్మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.వి. సురేంద్ర బాబు పాల్గొన్నారు.ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ.30,000/-లు మొదటి బహుమతి మరియు రూ.20,000/-లు రెండవ బహుమతిగా నిర్ణయించినట్లు ప్రకటించారు.