మొక్కులు చెల్లించుకుంటున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోడలు లక్ష్మీదేవి,మనువడు అనీష్ నెహ్రూ
(మంజీరగళం ప్రతినిధి):
జగ్గంపేట :
జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ విజయం కోసం వారి కోడలు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి జ్యోతుల నెహ్రూ మనవడు జ్యోతులనవీన్ లక్ష్మీదేవి దంపతుల తనయుడు నవ యువ నేత జ్యోతుల అనీష్ నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గంలోని అన్ని అమ్మవారిఆలయాలకు మొక్కుకున్నారు.ఎమ్మెల్యే నెహ్రూ అఖండ విజయం సాధించడంతో లక్ష్మీదేవి ఆదివారం జగ్గంపేట రావులమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ 101 కొబ్బరికాయలు కోట్టి అమ్మవారికి సారే చీర బహుకరించి మొక్కులు చెల్లించుకుని ఆదివారం రోజున గోకవరం మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న అమ్మవారి ఆలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు సందర్భంగా లక్ష్మిదేవి,అనీష్ నెహ్రూ మాట్లాడుతూ మనందరి అభిమాన నాయకుడు జ్యోతుల నెహ్రూ అఖండ విజయం సాధించడంతో నియోజకవర్గంలోని అన్ని అమ్మవారి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకుంటామని అందులో భాగంగా జగ్గంపేటలో ఉన్న రావులమ్మ వారిని దర్శించుకుని సింగరమ్మ చింతలో ఉన్న సింగర మ్మవారిని దర్శించుకుని ఆదివారం రోజు మొత్తం గోకవరం మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పోతుల మోహనరావు,జీను మణి బాబు,జనపరెడ్డి సుబ్బారావు (బాబు) బదిరెడ్డి అచ్చన్న దొర, దాసరి సీతారామకృష్ణ,మరి రెడ్డి సిరి,మండపాక అప్పన్న దొర,రాయి సాయి,నలమాటి ఆనంద్,చెలికాని హరిగోపాల్, గెడ్డమూరి బాబ్జి,కోనేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.