చిరకాల మిత్రులతో స్నేహితుల దినోత్సవ వేడుకను జరుపుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
(మంజీరగళం ప్రతినిధి ):
జగ్గంపేట:
ప్రపంచ స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన చిరకాల స్నేహితులు సోమవరం గ్రామ మాజీ సర్పంచ్ జంపన వెంకట సీతారామచంద్ర వర్మ, తాళ్లూరు గ్రామ మాజీ సర్పంచ్ పాలచర్ల సత్యనారాయణ, మట్టే సుబ్బారావుల తో కలిసి కేక్ కట్ చేసి స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు. ముందుగా ఒకరినొకరు ఘనంగా సత్కరించుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ పేద ధనిక చూడనిది.కులమత బేధాలు లేనిది బంధుత్వం కన్నా గొప్పది స్నేహబంధమని జ్యోతుల నెహ్రూ అన్నారు.మా మిత్రులతో స్నేహం దాదాపు 50 సంవత్సరాలుగా కొనసాగుతుందని ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం,గొల్లపల్లి సూరిబాబు,మారిశెట్టి రాధా, మండపాక అప్పన్న దొర పెనగంటీ బాబ్జి,సుంకర రాజు తదితరులు పాల్గొన్నారు.