Subscribe Us

header ads

స్నేహితుల దినోత్సవం రోజున గీతం విద్యార్థి మృతి

 విశాఖ జిల్లా వార్త..!

స్నేహితుల దినోత్సవం రోజున గీతం విద్యార్థి మృతి


 (మంజీర గళం ప్రతినిధి) ఆనందపురం 

 ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న రిజర్వేయర్ లో ఆదివారం నాడు విషాదం చోటు చేసుకున్నది.

 స్నేహితుల దినోత్సవం రోజున ఆనందంగా గడుపుదామని వెళ్లిన గీతం ఇంజనీరింగ్ ఎనిమిది మంది విద్యార్థులు లో ఒకరు మృతవార్త పడటంతో విషాదం చాయిలు అలముకున్నాయి అనంతరం ఆనందపురం సిఐ టీవీ తిరుపతిరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి, గీతం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలాస గ్రామానికి చెందిన డోకి. నిరంజన్ (20) విశాఖకు చెందిన జి యశ్వంత్, బి. ఆశేష్ హైదరాబాద్ కు చెందిన రోహిణి తాడేపల్లి గూడానికి చెందిన లలిత,మండలంలో ఉన్న గంభీరం రిజర్వాయర్ వద్దకు స్నేహితుడు దినోత్సవము కొరకు వచ్చినారు అక్కడ ఆనందంగా గడుపుతామని వచ్చి రిజర్వాయర్ ఒడ్డున నిలబడి ఫొటోస్ తీ సుకుందామని వెళ్లారు ఈ లోగా నిరంజన్ కాలుజారి రిజర్వాయర్లో పడిపోయాడు అది గమనించిన యశ్వంత్ మరియు ఆశిష్ ఇద్దరు కలిసి నిరంజన్ ను కాపాడ్డానికి రిజర్వాయర్ లోకి దూకారు ఈ ముగ్గురుకు ఈత రాకపోవటంతో మునిగిపోయారు అది గమనించిన అక్కడ ఉన్న ఫిషర్ మ్యాన్లు వెళ్లి గాలించి యశ్వంతు ఆశీస్సులను ఒడ్డుకు చేర్చారు నిరంజన్ పూర్తిగా అడుక్కు వెళ్లి పోవడంతో ఫిషర్ మ్యాన్ లుకు గాలింపులో దొరకలేదు రిజర్వాయర్ దగ్గర ఉన్న ఫిషర్ మాన్ మండల స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగినది, అనంతరం మృతుడిని పోస్టుమార్టం కు భీమిలి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు, అనంతరం ఆనందపురం సిఐ టీవీ తిరుపతిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.