మంజీరగళం ప్రతినిధి గోకవరం: గోకవరం మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా చిన్ననాటి నుండి ఆయా ప్రాథమిక పాఠశాలలోను ఉన్నత పాఠశాలలోనూ కళాశాలలోనూ చదువుకుంటూ ఒకరికొకరు పరిచయమై అలనాటి కాలం నుండి కూడా స్నేహితులుగా కొనసాగుతూ కష్టంలోనూ బాధలోనూ నష్టంలోను చేదోడు వాదోడుగా ఉంటూ తమజీవిత ప్రక్రియను జరిపించుకొనే స్నేహితులముగా మేము ఉన్నామని గర్వంగా చెప్పుకొనుచున్న మాకు ఏ విధమైన బేధము లేకుండా అందరం కలిసి ఏకతాటిపై ఉంటామని సంతోషంగా చెబుతూ ఈనాటి స్నేహితుల దినోత్సవం సందర్భంగా గుర్తుగా మా స్నేహం చిరస్థాయిగా నిలిచిపోవాలని తలంచి అభాగ్యులైన అనాధలకు కొందరికి అల్పాహారం రొట్టెలను పంపిణీ చేయడం జరిగిందని ఇది కేవలం మా స్నేహానికి గుర్తుగా మాత్రమే అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చింతాటి.వెంకన్న మల్లువలస.సుబ్బారావు చీకట్ల రాజు వరసాల.యేసు,చీకట్ల.సత్యానందంవీర్ల.వెంకటేశ్వరరావుమోర్తా.చిట్టి బాబు మొదలగువారు స్నేహితులు పాల్గొన్నారు.