Subscribe Us

header ads

చోరీ నేరం నందు నలుగురు వ్యక్తులు అరెస్ట్ లక్షా ఇరవై వేలు రికవరీ


కామవరపుకోట, మంజీరగళం ప్రతినిధి: ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి కాలేజీ బస్ వాహనాల టైర్స్, బ్యాటరీ, జాకీ చోరీ నేరం నందు నలుగురు వ్యక్తులను  అరెస్ట్ చేసి వారి వద్ద  నుండి  చోరీ సొత్తు (వర్త్ 1,20,000/-) అంతా రికవరీ చేసిన తడికలపూడి పోలీస్ సిబ్బంది తడికల పూడి పోలీసు స్టేషన్ పరిధిలో ది 28.07.2024 వ తేదీన రాత్రి సమయంలో కామవరపుకోట గ్రామం లో ఎస్సార్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న కాళీ స్థలం లో ఉన్న 2 కాలేజీ బస్ లు యొక్క డిస్క్ తో టైర్ లు -8 , 2 బ్యాటరీ, జాకీ 1 చోరీ నేరం జరిగిన నేపధ్యంలో సి ఆర్.నెం.183/2024 U/s 303(2) బి ఎన్ ఎస్  తడికలపూడి పి ఎస్ నమోదు చేసినారు

 జంగారెడ్డిగూడెం సబ్- డివిజన్ పోలీస్ ఆఫీసర్ అయిన యూ. రవి చంద్ర, మరియు జంగారెడ్డిగూడెం ఇన్స్పెక్టర్ సర్కిల్ పి. రాజేష్ ఆధ్వర్యం లో సదరు నేరము చేసిన వ్యక్తుల జాడ కనుగొనుటకు గాను టీమ్ లను ఏర్పాటు చేసినారు. 

సదరు టీమ్ ఇంచార్జ్ అయిన తడికల పూడి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎమ్. జయ బాబు మరియు టీం సభ్యులు ఏ ఎస్ ఐ 872, పి సి 810, 1166, 1560,2084 ,కలిసి ది. 03.08.2024 వ తేదీన ఉదయం తడికలపూడి గ్రామం లో విజయ మిల్క్ డైరీ వద్ద జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు వైపు ఏ పి 39 యు హెచ్ 5825 నెంబర్ గల మహీంద్రా ట్రక్ వాహనము లో క్రింది నలుగురు వ్యక్తులను  అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం శ్రీ జె ఎఫ్ సి యమ్ కోర్ట్ చింతలపూడి వారి ఎదుట ప్రవేశ పెట్టి, రిమాండ్ కు  పంపడం జరిగింది. 

ఫిర్యాది పేరు :

నందిగం ధర్మ రాజు s/o సుబ్బారావు, వయస్సు 52, కులం కమ్మ, తడికలపూడి గ్రామం, కామవరపుకోట మండలం. 

ముద్దాయిలు:-  

A.1. కుచ్చులాపాటి చందు S/o థామస్, వయస్సు 25 సంవత్సరాలు,నులకనివారి గూడెం గ్రామం, కామవరపుకోట మండలం.

A2. షైక్ కొల్ల ఈశ్వర కుమార్ S/o శ్రీను, వయసు 20, కామవరపుకోట గ్రామం మరియు మండలం.

A3. పొలాగాని సాయి దుర్గా రావు S/o యేసు, వయసు 22 , కామవరపుకోట గ్రామం మరియు మండలం.

A4 బొడ్డు వెంకట్ S/o రవి (లేట్), వయసు 21 , ఆడమెల్లి గ్రామం మరియు కామవరపు కోట మండలం.

హర్షిత స్కూల్ బస్ యొక్క 4 డిస్క్ తో టైర్ లు, 1 బ్యాటరీ, జాకీ- 1  

త్రివేణి కాలేజీ బస్ యొక్క 4 డిస్క్ తో టైర్ లు , బ్యాటరీ – 1

(వర్త్ 1,20,000/-)

ఈ కేసు దర్యాప్తు లో పాల్గొన్న ఎస్ఐ ఎమ్.జయ బాబు,  ఏ ఎస్ ఐ 872, PC 810, 1166, 1560, 2084 లను ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ అభినందించారు.