విజయవాడ, మంజీరగళం ప్రతినిధి: సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ అనుకూల తీర్పుని బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఇచ్చిన వ్యతిరేక ప్రకటన పై ఉమ్మడి కృష్ణాజిల్లా మాదిగ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి తొమ్మంద్రు యువరాజు తీవ్రంగా ఖండిచారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణకు మాలల కోసం ప్రకటన ఇవ్వడం మాదిగ జాతికి ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.బీఎస్పీ పార్టీ స్థాపకులు కాన్షీరామ్ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఉండాలని చెప్పిన మహానుభావుల మాటలు త్రోసిపుచ్చి బహుజన వాదాన్ని, అంబేత్కర్ వాదాన్ని ప్రక్కన పెట్టి సొంత అజెండాతో బీఎస్పీ పార్టీ అధినేత మాయావతి ప్రవర్తించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. మాదిగల అధినేత మందా కృష్ణమాదిగ చేస్తున్న సామాజిక పోరాటం అన్ని పార్టీలు మద్దతు ఇస్తుంటే ,బహుజన వాదాన్ని వినిపించే బీఎస్పీ పార్టీ నీ ప్రతి ఒక్క మాదిగ బిడ్డ తీవ్రంగా ఖండించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ కాపాడుకుని జాతిని ముందుకు తీసుకు వెళ్లవలసింది గా కోరినారు. ఎన్ వి ఎస్ రాష్ట్ర నాయకులు విక్టర్ బాబు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే ఎవరినైనా సహించేది లేదని తెలిపారు