(మంజీరా గళం ప్రతినిధి)తిరువూరు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారిపై ఏ.కొండూరు ఎమ్మర్వో బి.ఆశయ్య చేసిన తప్పుడు ఆరోపణలను పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖండించిన తెలుగు మహిళలు
ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కొలికపూడి గారి లాంటి మచ్చ లేని వ్యక్తిపై వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా కావాలనే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని తహసీల్దార్ ను విధుల నుండి వెంటనే బహిష్కరించాలని తన వెనుక ఉండి నడిపిస్తున్న వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను అలాగే పోలీసులను కోరిన తెలుగుమహిళలు
ఎమ్మెల్యే కొలికపూడి గారు తిరువూరు గడ్డపై అడుగుపెట్టిన మొదలు పేదలకు అనేక సహాయ, సేవా కార్యక్రమాలు చేస్తూ యువతకు ఆర్థిక సహకారం లాప్టాప్ లు, నియోజకవర్గంలో రోడ్లు మరమ్మత్తులు,డ్రైనేజీలు మెరుగుపరచడం, కాలువల పూడికలు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతుంటే మంచి పేరు వస్తుంటే చూసి ఓర్వలేక కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బేషరతుగా తహసిల్దార్ ఎమ్మెల్యే కొలికపూడి గారికి క్షమాపణ చెప్పి తహసిల్దార్ ను విధుల నుంచి బహిష్కరించాలని అధికారులను కోరిన - కొలికపోగు రామకోటమ్మ
ఎమ్మెల్యే కొలికపూడి గారిపై తాసిల్దార్ ఆశయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల్లో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కార మార్గంగా చూపిస్తున్న గొప్ప వ్యక్తి ఎమ్మెల్యే గారు అని పేర్కొన్న -మట్టా ఉషారాణి వెంటనే తహసిల్దార్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేసిన - బలమూరి నాగపద్మ
ఏ.కొండూరు మండలాన్ని దత్తత తీసుకొని, కిడ్నీ బాధితుల కోసం 1 కోటి 60 లక్షలు మంజూరు చేయించి కృష్ణా జలాల కోసం పైప్ లైన్ వేయించి,తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల సమస్యలను తన కుటుంబ సమస్యలుగా భావిస్తూ అమరావతి ఉద్యమం కోసం అహర్నిశలు పోరాడిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కొలికపూడి -అనుమోలు పద్మ
మంచి వ్యక్తిత్వం ఉన్న ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తహసిల్దార్ ను విధుల నుంచి బహిష్కరించి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరిన బొల్లిపోగు కళ్యాణి గెలిచిన దగ్గర నుండి ఒక్క సంవత్సరం జీతం అమరావతి రాజధాని కి విరాళం ఇచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గుండి రెడ్డి
ఈ సమావేశంలో కొలికపోగు రామకోటమ్మ బలమూరి నాగపద్మ మట్టా ఉషారాణి అనుమోలు పద్మ గుండి రెడ్డి వెంకటలక్ష్మి (బుజ్జి) బొల్లిపోగు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు..