అమరావతి
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ వేడుకలకు విశిష్ట అతిధులు గా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లు ఆయన తెలియ చేశారు. బుధవారం సాయంత్రం వెలగపూడి సెక్రటేరియట్లోని ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కందులు దుర్గేష్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల సంచాలకులు హిమాన్షు శుక్ల మర్యాదపూర్వకంగా కలిసి ఉప ముఖ్యమంత్రి వారిని ఆహ్వానించడం జరిగినది.