ఏలూరు /నూజివీడు : నూజివీడు మండలంలో గల పడమట దిగవల్లి రజక స్మశానవాటిక సమస్య పై ఆర్డిఓ కి నూజివీడు జనసేన నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది.
మండలంలోని పడమట దిగివల్లి గ్రామంలో రజక సోదరులు 100 సంవత్సరాలు గా ఉపయోగించుకుంటున్న స్మశాన వాటిక కొంతమంది ఆక్రమణ చేసి బెదిరింపులు గొడవలు చేస్తున్నారని వారి నుండి తరతరాలుగా వాడుకలో ఉన్న దోబీ ఘాట్ స్మశాన వాటిక ను రజక వర్గానికి ఇచ్చి అక్రమనాకు గురైన స్మశాన వాటిక ను తిరిగి అప్పజెప్పాలని స్పందన కార్యక్రమంలో ఆర్డీవో భవాని ని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు .శివరామకృష్ణ కోరారు.
ఆ గ్రామ పెద్దలతో కలసి జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి నియోజకవర్గ నాయకులు మరీదు శివరామకృష్ణ , మండల అధ్యక్షులు యర్రంశెట్టి రాము, మండల కార్యదర్శి కోటి,టౌన్ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్ ముత్యాల కామేష్, పడమట దిగివల్లి గ్రామ నాయకులు శివరామకృష్ణ,వెంకటేశ్వరరావు తదితరులు ఈరోజు ఆర్డీవోకి విన్నవించడం జరిగింది .త్వరలో దిగవల్లి గ్రామానికి విచ్చేసి సమస్య ను పర్యవేక్షించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మీడియా మాట్లాడుతూ... రజకుల స్మశాన వాటికల జోలికి ధోబిక ఎవరు వచ్చినా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని తెలిపారు. ఎవ్వడి బెదిరింపులు లొంగవద్దు మీకు ఎలపుడునసేన పార్టీ అండగా ఉంటుందని తెలపడం జరిగింది.