గన్నవరం :గన్నవరంలోనియోజకవర్గస్థాయి టిడిపి కార్యాలయం ను ఈనెల 19వ తేదీ ప్రారంభిస్తున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం లో టిడిపి కార్యాలయం కోసం స్థానిక గ్యాస్ కంపెనీ వద్ద ఓ ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ మేరకు కార్యాలయ భవనానికి రంగులు వేయటం పూర్తికాగా, కార్యాలయంలో ఫర్నిచర్ ఇతరత్రా ఏర్పాట్లు వేగవంతం గా చేస్తున్నారు. కార్యాలయంలో జరుగుతున్న పనులను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయం లో పలు మార్పులు, చేర్పులు చెపుతూ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ప్రస్తుతం గన్నవరంలో ఉన్న కార్యాలయం సరిపోవటం లేదని దీంతో పెద్ద భవనాన్ని అద్దెకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ భవనంలో ఏర్పాట్లు పూర్తికావచ్చాయని ఆగష్టు 19వ తేదీ నుంచి కార్యాలయం అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.