రెడ్డిగూడెం:
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం కోనపు రాజు పర్వ గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేశ్వర్ రెడ్డి ప్రతి గడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేడు వరకు తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంచి స్టిక్కర్లు వేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి పాలనకు 100 రోజులు పూర్తయ్యాయని పెన్షన్ల పెంపు, మెగా డీఎస్సీ, అన్నా క్యాంటీన్లు, అమరావతి, పోలవరానికి నిధులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసిందని 100 రోజుల్లో 100 కార్యక్రమాల వరకు ప్రభుత్వం అమలు చేసిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.