జగ్గంపేట:
జగ్గంపేట మండలం రామవరం ఇందిరా యానాదుల కాలనీలో గల సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి సముదాయం శిథిలావస్థల ఉంది.ఎక్కడికి అక్కడ కిటికీలు ఊడిపోవడం బిల్డింగ్ స్లాబ్ ముక్కలుగా రాలిపోవడం జరుగుతుండంతో బాలికలందరూ భయాందోళనలతో ఉన్న కారణంగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు విషయం తెలియజేయడంతో సోమవారం హాస్టల్ మొత్తం పరిశించారు.అనంతరం ఆయన బాలికలు ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పరిశీలిస్తున్నామని హాస్టల్ నిర్మించే వరకు వీరిని తాత్కాలికంగా ఏదో ఒకచోట ఎకామిడేషన్ కల్పిస్తామని నూతన హాస్టల్ నిర్మించేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు,మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు,అడబాల వెంకటేశ్వర రావు,నీలం శ్రీను, అనుకుల శ్రీకాంత్,ఎస్ డబ్ల్యు ఓ వాణి,బాలికల వసతిగృహం వార్డెన్ రోజా, బాలుర వసతి గృహం వార్డెన్ ప్రభాకర్ పాల్గొన్నారు.