Subscribe Us

header ads

కనకదుర్గమ్మ వారి నవరత్న ఖచిత స్వర్ణ కిరీటం గ్రామోత్సవాలు


 గోకవరం:

స్థానిక దేవిచౌక్ శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారికి భక్తులు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు సంకల్పించిన నవరత్న ఖచిత స్వర్ణ కిరీటం గ్రామోత్సవాలు మంగళవారం నుంచి మూడు రోజులు పాటు మండలంలోని పలు గ్రామాలలో నిర్వహిస్తునట్లు, రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు సోమవారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి స్వర్ణ ఖచిత కిరీటం,అమ్మవారి తాడు మంగళసూత్రం,నెత్తి మీద పెట్టుకొని గ్రామంలోని ప్రతి వీధిలో ప్రజలందరికీ దర్శనం కలిగించడానికి గ్రామోత్సవం చేపట్టామని అన్నారు. 


నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి స్వర్ణ ఖచిత కిరీటాన్ని తీసుకొచ్చి ప్రజలకు దర్శనం కల్పిస్తామని అన్నారు.ఈనెల 24 తేదీన మంగళవారం ఉదయం 9 గంటల నుంచి దేవి చౌక్ శ్రీ కనకదుర్గ ఆలయ సన్నిధి నుంచి గ్రామోత్సవం ప్రారంభమవుతుందని,కావున భక్తులు,మహిళామూర్తులు, గ్రామస్తులు,అమ్మ వారి సేవకులు,ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.గ్రామోత్సవాలు సందర్భంగా అమ్మవారి స్వర్ణ ఖచిత కిరీటం మీ ఇంటి ముందుకు వచ్చినపుడు మహిళలు హరతులతో స్వాగతం పలకాలని కోరారు.  


గ్రామోత్సవాలు అనంతరం వచ్చేనెల నాలుగో తేదీన శుక్రవారం 10.30 నిముషాలకు అంగరంగ వైభవంగా దేవిచౌక్ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి నవరత్న ఖచిత స్వర్ణ కిరీటం అలంకరించడం జరుగుతుందని తెలిపారు. గత ఏడాది కనకదుర్గమ్మ అమ్మవారికి స్వర్ణ ఖచిత కిరీటం చేయించాలని, సంకల్పించామని,ఈ ఏడాది దసరా ఉత్సవాలకు నవరత్న ఖచిత స్వర్ణ కిరీటం అమ్మవారికి అలంకరించాలని అనుకున్నామని,అనుకున్నట్లే స్వర్ణ కిరీటం ఎంతో శోభాయానంగా తయారైందన్నారు.


ఈ నవరత ఖచిత స్వర్ణ కిరీటానికి 21 లక్షల రూపాయలు ఖర్చయిందని,భక్తులు 7 లక్షల రూపాయలు విరాళాలు ఇవ్వగా,తాను 14 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి, అత్యంత వైభవంగా తయారు చేయించడం జరిగిందన్నారు. ఇంకా బంగారం మిగితే పదికాసులు బంగారంతో అమ్మవారికి తాడు, మంగళసూత్రం చేయించడం జరుగిందన్నారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప, ఇనకోటి బాపన్న దొర,తామర్ల రాంబాబు,వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ తదితరులు పాల్గొన్నారు