Subscribe Us

header ads

అమరావతి నాగపూర్ నేషనల్ హైవే అలాట్మెంట్ మార్చాలని సర్వే నెంబర్ 218 రఘునాధపాలెంలో ప్లాట్లు కోల్పోతున్న బాధితులు ఆందోళన


 ఖమ్మం:

రఘునాధపాలెం మండలం రఘునాధపాలెం గ్రామ సర్వే నెం.218లోని ప్రభుత్వం ద్వారా ఆర్.డి.ఎస్.నెం.బి/ 1529/2007లో శాంక్షన్ చేసి 2018వ సంవత్సరంలో 725 మందికి ఇంటి స్థాలాలు ఎలాట్ మెంట్ చేసి పట్టాలు ఇచ్చారని మాకు పట్టాలు వచ్చిన వెంటనే ఇండ్ల నిర్మాణం చేయు నిమిత్తం బేస్మెంట్లవరకు అందరు ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు చేశామని కాని ఈ ఏరియాలో కరెంట్ సౌకర్యం,నీటి సౌకర్యం లాంటి కనీస సౌకర్యాలు లేకపోవడం వలన మరియు కోవిడ్ - 19 లాక్ డౌన్ కూడా ఇదే సమయములో రావడంతో మా అందరికి ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడడంతో ఇండ్ల నిర్మాణం చేయలేకపోయామని రఘునాధపాలెం సర్వే నెం.218లోని ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు కోల్పోతున్న బాధితులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టి అట్టి విషయాన్ని అధికారులకు తెలియజేశారు.అసిస్టెంట్ కలెక్టర్ శ్రీమతి. శ్రీజ గారికి వినతిపత్రం ఇచ్చారు.

ఖమ్మం జిల్లా నీటిపారుదల శాఖ మాత్యులు శ్రీ. తుమ్మల.నాగేశ్వరావు గారు చొరవ తీసుకోని భాదితులకు ప్రభుత్వ సహకారంతో న్యాయం చేయాలనీ గత ప్రభుత్వం వారు ఇంటి నిర్మాణానికి జేవో ఈ రూ.3.00 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించియున్నారు.ఎనహేచ్ తదుపరి వచ్చిన కొత్త ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని ఎదురు చూచుచుండగా మాకు కేటాయించిన స్థలాల ప్రాంతం గుండా నాగపూర్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మించుటకు గాను సర్వే జరిగినది.ఈ రోడ్ నిర్మాణం మా స్థలాల గుండా పోవుట వలన నిరుపేదలమైన మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అతి నిరుపేదలమైన రోజువారీ కూలీలలమైన మాకు ప్రభుత్వం ఇచ్చిన ఈ స్థలాలు తప్ప వేరే ఏవిధమైన ఆధారము లేదు.కావున ప్రస్తుతం అట్టి ప్లాట్ల యందు అమరావతి నాగపూర్ హైవే వెళ్ళుటకు గాను సర్వే జరిగినది - దీనికి సంబంధించి రోడ్డు క్రింద మా ప్లాట్స్ పోకుండా అలైన్ మెంట్ మార్పు చేయుట గాని లేదా రొడ్డు క్రింద పోవు ప్లాట్ ఓనర్స్క రీసర్వే చేసి కంపెన్సేషన్ గాని లేదా ఆయొక్క స్థలానికి దగ్గరలో మాకు ప్లాట్స్ ఇచ్చి రూ.5 లక్షలు గృహనిర్మాణానికి ఇప్పించగలరని కోరారు.


ఈ కార్యక్రమంలో కుక్కల.కృష్ణ, కోనేటి.నారాయణ, చెరుకూరి.రామయ్య,వరకాలవిజయకుమారి,బుర్ర.ఉపేంర్ సాహు,కారుమంచి.ప్రసాద్,సుధాకర్,కోట.గాంధీ నాగరాజు,ఇమామ్సాహెబ్,రజాక్,నాగేశ్వరావు,రంగారావు,సతీష్,మెహరున్నిసాబేగం,రమాదేవి,రమణ,లక్ష్మి,రాములమ్మ,వాణిశ్రీ,పద్మావతి,భవాని,కృష్ణవేణి,అనేకమంది పాల్గొన్నారు