Subscribe Us

header ads

స్కూల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాగేశ్వర రెడ్డి


 రెడ్డిగూడెం:

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం జడ్.పి.హెచ్. స్కూల్లో విద్యార్థిని, విద్యార్థులకు టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి రెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ క్రీడలు మనిషి శక్తిని కొత్త పుంతలు తొక్కించడంతోపాటు మనోరంజక సాధనలలో భాగమైపోయాయి. సంప్రదాయమైన ఆటల కంటే సాధునిక ప్రపంచం గుర్తించిన ఆటల పోటీలలో ప్రావీణ్యం సంపాదిస్తే పేరు ప్రఖ్యాతులతో పాటు మంచి ఆదాయం కూడా లభించే అవకాశం ఉందని అన్నారు. మరియు శారీరిక సామర్థ్యంతో పాటు మానసిక ఉల్లాసం మానసిక ఆరోగ్యం కలుగుతుందని ఆరోగ్యంగా జీవిస్తారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు (ఎం.ఈ.ఓ)రమేష్ పాల్గొన్నారు.