పోలవరం:
ఏలూరుజిల్లా పోలవరం మండలంలో 5వ రోజు గ్రామ సభ కార్యక్రమంలో పోలవరం మండలం ఎల్ ఎన్ డి పేట లో ఏర్పాటు చేసినటువంటి గ్రామసభకు పోలవరం శాసన సభ్యులు శ్రీ చిర్రి బాలరాజు కి ఘనస్వాగతం పలుకుతూ ఆహ్వానించిన ఎల్ ఎన్ డి పేట గ్రామస్థులు.గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల వద్ద నుండి పలు వినతులను, ఫిర్యాదులను స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం 100 రోజులలో సాధించిన విజయాలను ప్రజలతో పంచుకున్నారు.
అనంతరం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పలు హామీలని నెరవేర్చామన్నారు. పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు , ఉద్యోగులకి 1వ తేదీన జీతాలు , పెంచిన ఫించన్ పంపిణీ , అన్నా క్యాంటీన్ లు ప్రారంభం ఇలా అనేక కార్యక్రమాలు చేశామన్నారు. విజయవాడలో ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన ప్రజలని ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు తో సహా అధికార యంత్రాంగం మొత్తం కలిసి పనిచేసింది అన్నారు.వరదల అనంతరం ప్రభుత్వం నష్టపోయిన ప్రజలని ఆదుకునేందుకు వారికి నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిందన్నారు.ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వం అని ప్రజలకు తెలిజేశారు దీపావళి నుండి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రీ బాలరాజు మరియు తెలుగుదేశం కన్వీనర్ బోరగం శ్రీనివాస్ కి ఎల్ ఎన్ డి పేట గ్రామస్తులు పోలవరం మండల కూటమి నాయకులు ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం కన్వీనర్ బోరగం శ్రీనివాస్, మండల అధ్యక్షులు గునపర్తి చిన్ని, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.