Subscribe Us

header ads

పొలం పిలుస్తోంది 'వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమం.


 జంగారెడ్డిగూడెం:

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ప్రతి మంగళ బుధవారంలో వ్యవసాయ,అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధుల పొలంబాట.
పంటసాగు పై చర్చలు రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సమాచారాన్ని పరిజ్ఞానాన్ని చేరువ చేయడం.
వ్యవసాయం,అనుబంధ శాఖల పథకాలపై అవగాహన కల్పించడం. క్షేత్ర సమస్యలకు తక్షణ పరిష్కారం సూచించడం. తక్కువ పెట్టుబడి....అధిక ఉత్పత్తి....ఎక్కువ నికరదాయం దిశగా ప్రోత్సహించడం.

ఈ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం, టెక్కిన వారిగూడెం గ్రామాలలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, టిడిపి మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ,టిడిపి మండల ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవ్, జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాజేష్,బిజెపి మండల అధ్యక్షులు పారేపల్లి సత్యనారాయణ, కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు,ఎంపీడీవో తాసిల్దార్ మరియు రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖతో పాటు ఉద్యాన శాఖ,సెరికల్చర్, పశుసంవర్ధక శాఖ మార్కెట్ కమిటీ, ప్రకృతి వ్యవసాయ సభ్యులు వారు వారి శాఖల యొక్క పథకాలపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమం 24-9-2024 మొదలుకొని 30-12-2024 వ తేదీ వరకు వారంలో ప్రతి మంగళ బుధవారాలలో మండలంలో నాలుగు గ్రామాలను సందర్శించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి కె.వి.ఎన్. పోచారావు తెలియజేశారు.