Subscribe Us

header ads

జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం దినోత్సవం.


 జంగారెడ్డిగూడెం:

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం
స్థానిక చత్రపతి శివాజీ త్రి శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్.ప్రసాద్ బాబు అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్.ప్రసాద్ బాబు మాట్లాడుతూ నేటి యువతకు నైతిక విలువలు, సేవా కార్యక్రమాలు వంటి చిన్న చిన్న విషయాలపై కూడా అవగాహన ఉండటం లేదని అందువలన కొన్ని రకాలైన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సేవా కార్యక్రమాలపై పూర్తిగా అవగాహన కల్పించవచ్చని మనం చేసే సర్వీస్ చాలా చిన్నదైనప్పటికీ కొన్ని సందర్భాలలో అది ఒక కుటుంబానికో, సమాజానికో ఎంతగానో ఉపయోగపడుతుందని, అందువల్ల కళాశాల ప్రాంగణంలోనే కొన్నిసార్లు రక్తదాన శిబిరాలు లాంటివి నిర్వహిస్తున్నామని, కళాశాల తరుపున వృద్ధాశ్రమాలకు బియ్యం, పండ్లు అందజేస్తున్నామని, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని అవన్నీ విద్యార్థులు తమంతట తాముగా చూసి నేర్చుకోవాలని అన్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 కోఆర్డినేటర్ నిట్టా వినయ్ మాట్లాడుతూ కళాశాల ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ల ద్వారా మొక్కలు నాటడం వాటి పెంపకం తో పాటు ప్లాస్టిక్ నిరోధక క్యాంపస్ గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.


 ఎన్ఎస్ఎస్ 2 కోఆర్డినేటర్ డా. గల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నెలలో ఒక శనివారం కచ్చితంగా స్వచ్ఛభారత్ లో భాగంగా క్యాంపస్ క్లీనింగ్ నిర్వహిస్తున్నామని, దీనితోపాటు కొన్ని రకాల అవేర్ నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నామని ఎన్ఎస్ఎస్ లో పాల్గొన్న విద్యార్థులకు ఉన్నత విద్య లో కూడా ప్రత్యేక సీట్లు ఉన్నాయని అన్నారు. వాటితో పాటు ప్రస్తుతం డిగ్రీ స్థాయిలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలకు ఇంటర్నల్ మార్కులు కూడా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలలో నిర్వహించే అన్ని కార్యక్రమాలలోనూ పాల్గొనడం వల్ల కొంతవరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా ఉపయోగపడతాయని ప్రత్యేకంగా ముఖ్యమైన తేదీల వరకు ఒకటి రెండు బిట్లు వస్తాయని అందువల్ల విద్యార్థులు ప్రత్యేక రోజుల పట్ల కూడా అవగాహన కలిగి ఉండటం మంచిదని అన్నారు. 


ఈ కార్యక్రమంలో కళాశాల ఐక్యూఎసి కోఆర్డినేటర్ డా. ఎమ్ మధు,గణిత విభాగ అధిపతి డాక్టర్ సిహెచ్ బదరీ నారాయణ, రసాయన శాస్త్ర విభాగ అధిపతి యు వెంకటాచార్యులు, కామర్స్ విభాగ అధిపతి డాక్టర్ కే ఉత్తమ్ సాగర్, చరిత్ర విభాగ అధిపతి బి అశోక్,పొలిటికల్ సైన్స్ విభాగ అధిపతి ఎమ్.శ్రీనివాసరావు ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.