చాట్రాయి:-
ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలలో నులిపురుగుల నివారణకై ఆల్బెండజోల్ మాత్రలు మ్రింగించే కార్యక్రమం సెప్టెంబరు 17వ తేదీన నిర్వహిస్తు న్నట్లు చాట్రాయి పీహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ కె. విజయలక్ష్మి ,మండల విద్యా శాఖాధికారి బ్రహ్మచారి తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.శుక్రవారం అంగన్వాడి సెంటర్లకు ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేసినట్లు వారు ఇరువురు తెలిపారు . ఈ మాత్రలు మ్రింగటం ద్వారా బాల బాలికలలో వచ్చు రక్తహీనతను నివారించ వచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ. శ్రీనివాసుల రెడ్డి హెచ్ ఇ ఓ పి వి శ్రీధర్, ఏఎన్ఎంలు ఆషాలు తదితరులు పాల్గొన్నారు.