Subscribe Us

header ads

సింగన్నగూడెం లో ముంపు బారిన పడిన మినుము పంటను పరిశీలించిన ప్రజాప్రతినిధులు,


 గన్నవరం:-

రాష్ట్రముంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దశ దిశ నిర్దేశంతో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారి సూచనలతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాపులపాడు మండలం సింగన్నగూడెం గ్రామంలో వెట్టివాగు వరద వృద్ధికి పూర్తిగా మునిగిపోయి నష్టపోయిన మినుము పంటను ఈరోజు మధ్యాహ్నం సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్రఅధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణా రావు, రంగన్నగూడెం గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి, ఎంపిటిసి సభ్యులు పుసులూరు లక్ష్మీ నారాయణ, మండల వ్యవసాయఅథికారి జొన్నలగడ్డ భవాని, తదితరులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో నష్టం వివరాలను తెలుసుకున్నారు. 

ఇదేవిషయమై ఈరోజు సాయంత్రం సింగన్నగూడెం నుండి ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ, బాపులపాడు మండలం లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 27 గ్రామాలకు సంబందించి ఈ సీజన్ లో 16500, ఎకరాలలో వరిసాగుచేయగా, ఈరోజు తుది సమాచారం మేరకు 8800 ఎకరాలలో ముంపునకు గురైనదిఅని, ఇప్పటివరకు 4125 ఎకరాలు నమోదు చేయటం జరిగిందని, అట్లాగే మండలం లో ఈసీజనులో 1562ఎకరాలలో మినుము సాగు చేయగా మొత్తం ముంపునకు గురై 90శాతం చనిపోయిందని ఈరోజు తుది సమాచారం మేరకు 886ఎకరాలు నమోదు చేయడం జరిగిందని మిగిలిన విస్తీర్ణం కూడా మండలంలోని రైతులు వ్యవసాయ అధికారుల ద్వారా నివేదికను రాష్ట్రప్రభుత్వందగ్గరకు త్వరగా వెళ్ళటానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 

మండల వ్యవసాయ అథికారి జె. భవాని మాట్లాడుతూ నష్టపోయిన పంట నమోదును ఆర్.బి.కె.ల ద్వారా వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం అని, నష్ట పోయిన రైతులను సంబందిత ఆరిబికె లు గ్రామ రెవిన్యూ అధికారుల కు సమాచారం ఇచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వెట్టివాగు వరద వృద్ధితికి రైతులు జన్మభూమి పధకం ద్వారా నిర్మించుకున్న మట్టి రోడ్డు గండిని ప్రజా ప్రతినిదులు పరిశీలించారు.

ఈ పరిశీలనా కార్యక్రమంలో నష్టపోయిన మినుము రైతులు ఈతాకుల వరప్రసాద్,బెజవాడ శ్రీనివాసరావు,దేవరపల్లి మోషే, ఈతాకుల జయరాజు, తొమ్మండ్రు ఆనంద్ బాబు, రైతు ప్రభుఖులు కసుకుర్తి అర్జునరావు,పల్లగాని వీరాంజనేయులు, కనకవల్లి శేషగిరి రావు, కసుకుర్తి వేణు బాబు,విలేజి రెవిన్యూఅథికారి, జి.సీమోను,గ్రామ అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఆళ్ళ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.