Subscribe Us

header ads

ఆనందపురం పోలీస్ స్టేషన్ నూతన సీఐ గా చింత వాసు నాయుడు


ఆనందపురం

ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గం లో గల ఆనందపురం పోలీస్ స్టేషన్ కు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చింత వాసు నాయుడు శుక్రవారం సిఐగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అల్లూరి జిల్లా ఎన్ డి పి ఎస్ టాస్క్ఫోర్స్ లో పనిచేసిన చింత వాసు నాయుడు అనందపురం పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు. వాసు నాయుడు గతంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ భీమిలి, సిటీ టాస్క్ ఫోర్స్ లో పని చేసి పదోన్నతపై శ్రీకాకుళం లో కొన్ని రోజులు పాటు  సి ఏ గా పని చేశారు. అనంతరం అల్లూరు జిల్లా ఎండిపీఎస్ టాస్క ఫోర్స్ విభాగంలో సీఐగా పనిచేసి కమిషనర్ ఆదేశాల మేరకు నేడు ఆనందపురం సిఐ గా బాధ్యతలు చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర విభాగాలు రేటు పెరగకుండా శాంతి భద్రత పరిరక్షణకు పని చేస్తానన్నారు ఈ మేరకు స్థానిక ఎస్సైలు గంట్యాడ సంతోష్ పందిరి శివ రైటర్ గాంధీ, మరియు సిబ్బంది,ప్రజా ప్రతినిధులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన వాసునాయుడు కు ఘనంగా స్వాగతం పలికారు ఇక్కడ సిఐగా పనిచేసిన టీవీ తిరుపతిరావు కమిషనర్ ఆదేశాల మేరకు విశాఖ రేంజ్ విఆర్ కు బదిలీపై విశాఖపట్నం వెళ్లారు ఈ కార్యక్రమంలో పత్రిక సోదరులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొని ఘనముగా స్వాగతం పలికారు.